శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. సోనమ్ కపూర్ పెళ్లి ఫిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. సోనమ్ కపూర్ పెళ్లి ఫిక్స్

March 24, 2018

శ్రీదేవి మరణం కపూర్ కుటుంబాన్ని తీరని విషాదానికి గురిచేసింది. విషాదం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిది అంటారు పెద్దలు. ఇప్పుడదే పనిలో వున్నారు బోనీకపూర్ కుటుంబసభ్యులు. తమ్ముడు అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్ళితో ఆ ఇంట్లో ఆనందాలు పూయించాలనుకుంటున్నారు. సోనమ్ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను ప్రేమించి పెళ్ళి చేసుకుంటోంది. ఇద్దరూ లండన్‌ హాలిడే ట్రిప్‌కు వెళ్ళారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో గడుపుతున్నారు. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్, వెన్యూ ఫిక్స్ అయింది. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.   

సంగీత్, మెహందీ లాంటి కార్యక్రమాలతో ట్రెడిషనల్ హిందూ వెడ్డింగ్‌లా ఈ పెళ్లి వేడుక జరుగబోతోంది. అయితే పెళ్లి వేడుకకు ముందే కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్‌మెంట్ వేడుక జరుగనుందట. అతిథులందరినీ జెనీవా తీసుకెళ్లాలి కాబట్టి భారీ ఎత్తున ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ గెస్టులకు స్వయంగా ఫోన్లు చేస్తూ తన కూతురి పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారట.