శ్రీదేవి నాకు చెల్లెలు.. కమల్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి నాకు చెల్లెలు.. కమల్

March 2, 2018

నటి శ్రీదేవి మరణించిన తర్వాత కల్పిత కథనాలతో కోలివుడ్‌లో కథనాలు ప్రసారం చేయడంపై సినీ నటుడు కమల్ హాసన్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇది   మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు. దివంగత శ్రీదేవి తనకు సోదరితో సమానం అని  ఆయన స్పష్టం చేశారు. తాను కూడా శ్రీదేవితో  కలిసి ఆమె తల్లి చేతి గోరుముద్దలు తిన్నానని చెప్పాడు.చనిపోయిన వారి గురించి లేని పోని వదంతులు సృష్టించి ఇబ్బంది పెట్టవద్దని ఆయన మీడియాను కోరారు. కోలీవుడ్‌లో శ్రీదేవి, కమలహాసన్  హిట్‌పెయిర్ జోడీగా పేరు ఉంది. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. తాజాగా కమల్ రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీదేవితో ఆయనకు సంబంధాలను అంటగడుతూ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు.తనను రాజకీయల్లో దెబ్బతీయడానికే ఇలా కొందరు మీడియాను అడ్డం పెట్టుకుని తప్పడు కథనాలు ప్రసారం చేస్తున్నారని కమల్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు.