శ్రీదేవి పెళ్లికూతురయ్యింది..

54 ఏళ్ళ వయసులో కూడా శ్రీదేవి ఇంకా పడుచు పిల్లలానే వుంది. అచ్చం పెళ్ళి కూతురిలా దర్శనమిచ్చింది. ఈ వయసులో పెళ్ళి కూతురి గెటప్‌లోనా ? అని చాలా మంది ఆమె ఫ్యాన్స్ తత్తరపాటుకు లోనయ్యారు. అయితే ఆమె ఇంతందంగా ఎందుకు తయారైందంటే..

బెంగుళూరులో టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో శ్రీదేవి ఇలా పెళ్లి కూతురి గెటప్‌లో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ దర్శనమిచ్చిందన్నమాట. ఈ వేడుకలో బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ కూడా పాల్గొన్నది. రాం గోపాల్ వర్మ ఒక సందర్భంలో అన్నట్టు శ్రీదేవి వందేళ్ళైనా అంతే అందంగా వుంటుందేమో.  అది నిజమే అనిపిస్తోంది ఇప్పుడు శ్రీదేవిని చేస్తుంటే. ఈ మధ్యే ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్ బికినీలో కనిపించి షాకిచ్చింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఈ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తల్లి మెల్లగా వన్ బై వన్ సినిమాలు చేస్కుంటూ వెళ్ళిపోతోంది మరి కూతుళ్ళను ఎప్పుడు హీరోయిన్లుగా పరిచయం చేస్తుందోనని శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

SHARE