శ్రీదేవి కోసం అర్జున్‌రెడ్డిలా విలపిస్తున్న వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి కోసం అర్జున్‌రెడ్డిలా విలపిస్తున్న వర్మ

February 26, 2018

అతిలోక సుందరి శ్రీదేవి  మరణవార్త విన్న తర్వాత సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చలించిపోతున్నాడు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆర్జీవి ఒక్కసారిగా కుంగిపోయాడు. వరుస ట్వీట్లతో ఆమె జ్ఞాపకాలలోని క్షణాలను యుగాల్లా  తలచుకుని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నిన్నంతా  తన ట్విటర్‌లో పెట్టిన ఎమోషనల్ ట్వీట్స్‌ను చూసిన ఓ నెటిజన్ ‘ అర్జున్‌రెడ్డి ’ డైలాగ్‌ను పోస్ట్ చేశారు. ఆ డైలాగ్‌ను వర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

రేయ్ నాకు ఆ పిల్ల అంటే ఇష్టం. మనకు ఏమన్నా ఎఫెక్ట్ అయితే.. మనం పోతే ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు. అది నా లైఫ్‌లో ఆ పిల్లే. ఆ పిల్లకు ఏమన్నా అయితే ఐ విల్ బి ది మోస్ట్ ఎఫెక్టెడ్ అండర్‌స్టాండ్ ’ అంటూ విజయ్ దేవరకొండ క్లాస్‌రూంలో షాలినీ పాండేను ఏడిపించిన ఓ వ్యక్తికి చెప్పిన డైలాగ్ ఇది. వర్మ, శ్రీదేవి పిక్స్ పైన కింద ఈ డైలాగ్‌తో ఉన్న పోస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు వర్మ.