దుబాయ్‌లో శ్రీదేవి వున్న గదిని సీజ్ చేశారు - MicTv.in - Telugu News
mictv telugu

దుబాయ్‌లో శ్రీదేవి వున్న గదిని సీజ్ చేశారు

February 26, 2018

మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన నటి శ్రీదేవి మృతి పట్ల సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో శ్రీదేవి బస చేసిన జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌ గదిని అక్కడి పోలీసులు సీజ్‌ చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె బస చేసిన సూట్‌ మొత్తాన్ని ‘క్రూషియల్‌ స్పాట్‌’గా గుర్తించారని, దీనిపై స్పందించేందుకు హోటల్ యాజమాన్యం నిరాకరిస్తోందని పేర్కొంటూ వార్తలు వస్తున్నాయి.

పోలీసులు కూడా ఆమె బస చేసిన గదిని సాధారణ ప్రక్రియలో భాగంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. శ్రీదేవి మృతదేహం రాగానే ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ముంబై జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.