30 ఏళ్ల క్రితమే తండ్రికి తోడుగా రాజకీయాల్లో  శ్రీదేవి! - MicTv.in - Telugu News
mictv telugu

30 ఏళ్ల క్రితమే తండ్రికి తోడుగా రాజకీయాల్లో  శ్రీదేవి!

February 26, 2018

చిన్ననాటి నుంచి నటనకు దగ్గరైన శ్రీదేవి రాజకీయాల్లో కూడా తన వంతు పాత్ర పోషించింది. 30 ఏళ్ల క్రితమే తన తండ్రి కే. అయ్యప్పన్ తరపున ఎన్నికల ప్రచారం చేసింది శ్రీదేవి. 1989లో కాంగ్రెస్  శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌కు తమిళనాడులోని శివకాశి నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. తమిళనాడులో ఎంజీఆర్ మృతి తర్వాత వచ్చిన ఎన్నికలు కావడంతో 1989లోని అసెంబ్లీ ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. అన్నాడీఎంకేలో జయలలిత వర్గం, ఎంజీఆర్ సతీమణి జానకి వర్గం, డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య తమిళనాడులో ఎన్నికల సమరం నెలకొంది.

అయితే అప్పటివరకు క్రియాశీల రాజకీయాల్లో  లేని  శ్రీదేవి తండ్రి  రాజీవ్ గాంధీ చొరవతోనే శివకాశి టికెట్ వచ్చిందని చెబుతారు.అంతకు ముందు  రాజీవ్ గాంధీ తమిళనాడుతో పర్యటించినపుడల్లా  అయ్యప్పన్ ఆయనే వెంటే ఉండేవాడట. అయితే తండ్రికి  కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో  శ్రీదేవి తండ్రికి తోడుగా శివకాశి నియోజక వర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో  పాల్గొంది.  శ్రీదేవిని కాంగ్రెస్ పార్టీ  తమ పార్టీకొరకు తమిళనాడు రాష్ట్రం మొత్తం  కూడా ప్రచారం చేయించాలని చూశారు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. కానీ ఈ ఎన్నికల్లో డీఎంకే నేత పీ.శ్రీనివాసన్ చేతిలో 5 వేల ఓట్ల తేడాతో శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలలో రాణించలేకపోయాడు.