శ్రీదేవి డెత్ సర్టిఫికెట్ ఇంకా రాలేదు.. ఎందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి డెత్ సర్టిఫికెట్ ఇంకా రాలేదు.. ఎందుకు?

February 26, 2018

అందాల నటి శ్రీదేవి  మరణవార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శనివారం రాత్రి దుబాయ్‌లోని హోటల్లో ఆమె గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అయితే పోస్ట్ మార్టం పూర్తి కావడానికి బాగా ఆలస్యమైంది. డెత్ సర్టిఫికెట్ ఇంకా రాలేదు..

 

యూఏఈ నిబంధనలు క్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. అక్కడి నిబంధనల ప్రకారం.. పోస్టు మార్టం చేశాక  ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందిస్తారు. శ్రీదేవి భౌతిక కాయాన్నా పాడవకుండా ఎంబామింగ్ చేస్తారు. తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. తర్వాత పోలీసులు డెత్ సర్టిఫికెట్‌ చేసి ఇస్తారు. దాన్ని మళ్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాండోవర్ చేసుకోవాలి. తర్వాతే  మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. తర్వాత రిలయన్స్‌కు చెందిన విమానంలో భౌతిక కాయాన్ని భారత్‌కు తరలిస్తారు. ఈ రోజు సాయంత్రానికి ముంబై చేరుకుంటుంది. శ్రీదేవి అంత్యక్రియలను జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో నిర్వహిస్తారు.