‘ మహానటి ’ చిత్రం శ్రీదేవికి అంకితం... - MicTv.in - Telugu News
mictv telugu

‘ మహానటి ’ చిత్రం శ్రీదేవికి అంకితం…

February 26, 2018

భారతీయ చిత్ర పరిశ్రమలో  శ్రీదేవికి ఉన్నచరిష్మా అంతా ఇంతా కాదు. తన నటనతో ఔరా అనిపించుకున్న అతిలోక సుందరికి అశేషమైన అభిమానులు ఉన్నారు. తనను అభిమానించే వాళ్లందరి దగ్గర నుంచి  సెలవు తీసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆమెతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకొని  సన్నిహితులంతా ఆవేదన చెందుతున్నారు.

శ్రీదేవితో ‘ ఆఖరిపోరాటం ‘ ‘ జగదేకవీరుడు అతిలోక సుందరి ‘ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అశ్వనీదత్, ఆమెతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన బ్యానర్‌పై రూపొందుతున్న ‘ మహానటి ‘ సినిమాను శ్రీదేవికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. త్వరలోనే పాటలను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కీర్తి సురేష్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.