శ్రీదేవి  జీవితంపై డాక్యుమెంటరీ... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి  జీవితంపై డాక్యుమెంటరీ…

March 7, 2018

అందాల తార శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ వంటి పలు భాషా చిత్రల్లో నటించి అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. బాలనటి నుంచి కథానాయకగా ఆమె అంచలంచెలుగా ఎదిగిర తీరు ఎందోరికో ఆదర్శం . అలాంటి శ్రీదేవి అభిమానులను ,కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేస్తూ ఆనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆమె హఠాన్మరణంతో షాక్‌కి గురైన బోనీకపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో బోనీకపూర్‌కు  సన్నిహితులైన కొంతమంది నిర్మాతలు  శ్రీదేవి బయోపిక్ చేస్తామనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారని సమాచారం.  శ్రీదేవి జీవితం సముద్రమంత. ఆమె జీవితంలోని మలుపులను రెండు గంటల్లో చెప్పడం కష్టం. అందువలన శ్రీదేవిపై డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బోనీ వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రాజెక్టును తనకి మంచి స్నేహితుడైన శేఖర్‌కపూర్‌కి అప్పగించినట్టు బాలీవుడ్ సమాచారం.