నేడు బోనీ కపూర్ అరెస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

నేడు బోనీ కపూర్ అరెస్ట్!

February 27, 2018

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు రేగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఆమె భర్త బోనీకపూర్‌ను  దుబాయ్ పోలీసులు నిన్న మూడు గంటల పాటుగా  విచారించారు. నేడు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే ఆయన పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. బోనీ కపూర్‌ను ఈ రోజు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల కాల్‌డేటాను పోలీసుల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి  ఒకరికి ఎక్కువ కాల్స్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.పెళ్లి 20న జరిగితే శ్రీదేవి 24 వరకు దుబాయ్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పెళ్లి  తర్వాత బోనీ ఎందుకు ముంబై వచ్చారు? మళ్లీ తిరిగి దుబాయ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆమె  టబ్‌బాత్‌లో ఉండగ ఎవరు మొదట చూశారు? ప్రమాద వశాత్తూ టబ్బులో పడి చనిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు అంత పక్కాగా ఎలా చెప్పగలిగారు? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు మళ్లీ విచారణ మొదలు పట్టారు.