శ్రీదేవి లేని ఈ బతుకు నాకొద్దు... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి లేని ఈ బతుకు నాకొద్దు…

March 2, 2018

అందాల నటి శ్రీదేవి మరణవార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తన అంతిమ యాత్రలో భారీగా అభిమానులతో ముంబై రోడ్లు అన్ని జనసంద్రమయ్యాయి. బాలీవుడ్ నటి రాఖీసావంత్ కూడా అంత్యక్రియల్లో పాల్గొంది. అంత్యక్రియల ఆనంతరం రాఖీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదనను తెలిపింది. ‘ శ్రీదేవి జీ.. మీరు మ‌మ్మ‌ల్ని వ‌దిలి వెళ్ళ‌డం చాలా బాధ‌గా ఉంది. ల‌వ్‌యూ సోమ‌చ్‌.. మీకు ఏమైంది.. ఎందుకు వ‌దిలి వెళ్లిపోయారు.. మీలా ఎవ‌రు న‌టించ‌లేరు..డ్యాన్స్ చేయ‌లేరు.. మీరు చాలా మంచివారు.. మీరు లేక‌పోండంతో నాకు బ్ర‌త‌కాల‌నిలేదు ’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది రాఖీ. శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ అంతా శ్రీదేవి ఫోటోలతో నింపిన రాఖీ సావంత్ .తాజాగా శ్రీదేవిలా ఉన్న ఓ చిన్నారి వీడియోని పోస్ట్ చేసి శ్రీదేవి మ‌ళ్ళీ పుట్టారు.. అందరికీ శుభాకాంక్ష‌లు తెలిపింది.