శ్రీదేవి కూతురు వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి కూతురు వచ్చేసింది

October 24, 2017

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్  తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మరాఠీ హిట్ మూవీ‘సైరాట్ ’ హిందీ రీమేక్ లో ఆమె నటించనుంది.  తక్కువ బడ్జెట్లో నిర్మితమైన సైరాట్  భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను వివిధ భాషల్లోకి రీమేక్ చెయ్యాలని చాలా మంది నిర్మాతలు దీని హక్కులను కొనుక్కున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ సొంతం చేసుకున్నారు.

సైరాట్ లో నటించిన రింకూ రాజ్‌గురు, ఆకాశ్ థోసార్ పాత్రలకు ఎవరైతే నప్పుతారోనని కరణ్ జోహర్ చాలా మందిని చూశాడు.. చివరికి రింకూ, ఆకాశ్‌లనే తీసుకుందామనుకున్నాడు.. కానీ శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవిని చూశాక ఆమెనే రింకూ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కపూర్‌ను కూడా ఎంచుకున్నాడు.

ఇక డైరెక్టరుగా ఇంతకు ముందు తమ సంస్థలో ‘హమ్టీ శర్మాకి దుల్హనియా’ సినిమాకు దర్శకత్వం వహించిన శశాంక్ ఖేతాన్‌ను ఎంచుకొన్నాడు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2018లో సినిమాను విడుదల చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.