పవన్‌‌కు శ్రీనిరాజు లీగల్ నోటీసు.. - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌‌కు శ్రీనిరాజు లీగల్ నోటీసు..

April 21, 2018

పవన్ కల్యణ్ తన ట్విటర్ ఖాతాలో శ్రీరెడ్డి వెనకాల వుండి నడిపిస్తున్న డ్రీంటీమ్ మెంబర్స్ ఈ నలుగురు అని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద శ్రీసిటీ ఓనర్ శ్రీనిరాజు చట్ట ప్రకారం వెళ్ళటానికి సిద్ధమయ్యారు. పవన్‌కు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు.దీనిమీద పవన్ వివరణ ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ టి. సునీల్ రెడ్డి నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ నోటీస్ మీద పవన్ తన ట్విటర్‌లో స్పందించారు. ‘ మా అమ్మను అవమానించిన ఈ డ్రీంటీమ్‌లో లాయర్లు సభ్యులు కారనుకుంటున్నా’ అని ట్వీట్ చేయడం గమనార్హం.