నేనింతవరకు ఎవర్నీ ‘గారు’ అనలేదు.. శ్రీరెడ్డిగారిని అంటున్నా - MicTv.in - Telugu News
mictv telugu

నేనింతవరకు ఎవర్నీ ‘గారు’ అనలేదు.. శ్రీరెడ్డిగారిని అంటున్నా

April 13, 2018

గత కొంతకాలంగా ‘కాస్టింగ్ కౌచ్ ’ పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిలను లొంగదీసుకుని అన్యాయం చేస్తున్నారంటూ శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. మహిళల పట్ల సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ప్రవర్తించే తీరు అసహనానికి గురి చేస్తోంది. ఎంతో మంది మహిళల జీవితాలు వారి చేతిలో నలిగిపోతున్నాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డికి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.మరోవైపు సోషల్ మీడియా వేదికగా రోజుకొకరి పేరు చొప్పున పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెడుతూ.. సినీ ఇండస్ట్రీలోని పెద్దలకు  ముచ్చెమటలు పట్టిస్తున్న…శ్రీ రెడ్డిని తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసించాడు. ‘ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న శ్రీ రెడ్డిని గౌరవిస్తున్నాను. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసి విక్టరీ సాధించిన నీకు వందనాలు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.అలాగే ఓ మీడియా ఛానల్ లైవ్‌లో ఫోన్‌లో మాట్లడారు ఆర్జీవి. ‘ నేను ఇంత వరకు ఎవ్వర్నీ గారు అని సంబోధించను. కానీ శ్రీరెడ్డిని గారు అని సంబోధిస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఒక చెత్త దురాచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన శ్రీరెడ్డి గారికి హ్యాట్సాఫ్. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో శ్రీరెడ్డి గారు ఈ ఇష్యూను తీసుకువెళ్ళి టాలీవుడ్ ప్రక్షాళనకు పూనుకున్నారు ’ అని అన్నారు. శ్రీరెడ్డి ఆర్జీవి కాంప్లిమెంట్‌కు లైవ్‌లోనే ఆనంద భాష్పాలు కార్చింది.