నటి  శ్రీవిద్య ఇల్లు వేలం.. - MicTv.in - Telugu News
mictv telugu

నటి  శ్రీవిద్య ఇల్లు వేలం..

March 17, 2018

ప్రముఖ దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయ పన్నుశాఖ వేలం వేయనుంది. శ్రీవిద్యకు చెన్నై అభిరామపురంలోని సుబ్రమణ్యపురం వీధిలో రెండస్తుల ఇల్లు ఉంది. అందులో ప్రస్తుతం డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు.  ఇంటికి గతకొంత కాలంగా ఆస్తి పన్ను చెల్లిచడంతో లేదు. డ్యాన్స్ స్కూల్ ద్వారా వస్తున్న అద్దెను ఆదాయపన్నుశాఖ జమ చేసుకుంటోంది.

పన్ను బకాయిలు, వాటిపై వడ్డీ, వేలం ఖర్చుల కోసం ఆ ఇంటిని ఈ నెల 27న వేలం వేస్తున్నారు. 1,250 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఇంటి ధరను రూ. 1,17,20,000గా ధర నిర్ణయించారు. శ్రీవిద్య తెలుగు, తమిళం,మలయాళంతోపాటు కన్నడంలో వందలాది చిత్రాల్లో నటించారు. 2006 తిరువనంతపురంలోకేన్సర్‌తో చనిపోయారు.