శ్రియ భర్త ఈయనే.... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రియ భర్త ఈయనే….

March 17, 2018

సినీనటి శ్రియ రహస్య వివాహం చేసుకుంది. మార్చి 12న ముంబైలో  కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుందని సమాచారం. రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కోస్‌చీప్‌ను  హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది . సినీ పరిశ్రమకు సంబంధించి మనోజ్ బాజ్‌పాయ్, షబానా ఆజ్మీ మాత్రమే పెళ్లికి హాజరయ్యారని టాక్. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం మార్చి 11న జరిగింది.పెళ్లిలో పింక్‌కలర్ చీరలో మెరిసిపోయిందని చెబుతున్నారు.2001 లో వచ్చిన ‘ ఇష్టం ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రియ. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్‌హీరోల సరసన నటిచింది. అనతి కాలంలోనే అగ్ర కథానయికగా ఎదిగింది. ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలో నటిస్తోంది.