రబ్బర్ మేన్... - MicTv.in - Telugu News
mictv telugu

రబ్బర్ మేన్…

August 24, 2017

రబ్బర్ ఎట్లుంటదీ.. మెత్తగ ఎటు వంపితే అటు వంగుతుంది. బొక్కలు ఎట్లుంటయీ.. గట్టిగుంటయి. కానీ ఇక్కడొక వ్యక్తి శరీరంలోని బొక్కలు రబ్బరుతోనే తయారయ్యాయా అనిపిస్తుంది. అతని పేరు జస్ ప్రీత్ సింహ్ కాల్రా. పంజాబ్ లోని లుధియానాకు చెందిన ఇతను పంజాబ్ లో రబ్బర్ మేన్ గా ప్రఖ్యాతి గాంచుతున్నాడు.

అతని ఒళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్ గా వుంటుందంటే మెడను వెనక్కు తింపి కూల్ డ్రింకును వెనక నుండే తాగగలడు. తన వెనకాల ఏదైనా జరుగుతుంటే..  అందరిలా మొత్తం తిరిగి చూడకుండా తల మాత్రమే తిప్పి చూడగలడు. ఇతను ఇండియాకు రబ్బర్ మేన్ లాంటివాడని ఫేమస్సైపోయాడు. ఇన్ని రోజులూ మనం స్పైడర్ మేన్, సూపర్ మేన్ ల గురించి చదువుకున్నాం, సినిమాలు చూసాం. కానీ ఇకనుండి ‘ రబ్బర్ మేన్ ’ గురించి తెలుసుకుంటాం, మాట్లాడుకుంటాం..

జస్ ప్రీత్ సింహ్ 360 డిగ్రీల కోణంలో ఏకకాలంలో మెడను, తలను, చేతులను తిప్పి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. లుధియానాలోని BCM సీనియర్ సెకండరీ స్కూల్లో 11 వ తరగతి చదువుకుంటున్నాడు ఇతడు..

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో, లిమ్కా బుక్ లో తన పేరును నమోదు చేసుకోవడమే గాకుండా వరల్డ్ ఫేమస్ రబ్బర్ మేన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యం అంటున్నాడు. తను యోగా చేస్తూ ఈ ప్రక్రియలో నిష్ణాతుణ్ణయ్యానని అంటున్నాడు.