ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైంది - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైంది

March 29, 2018

తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు అందించిన నటుడు ఎన్టీఆర్. ఆయన జీవితచరిత్ర ఆధారంగా సినిమా అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. గురువారం నాచారం రామకృష్ణ స్టూడియోలో ఉదయం 9.42 నిమిషాలకు చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. బాలయ్య దుర్యోధనుడి గెటప్‌లో కనిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్లాప్ ఇవ్వగా.. ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యంత ఫేమస్ అయిన దాన వీర శూర కర్ణ చిత్రంలోని ‘ ఏమంటివి ఏమంటివి ’ అన్న డైలాగ్ పలికారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ మెరవనునున్నారు. తేజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెంకయ్యతో పాటు  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై బాలకృష్ణను అభినందించారు. డిసెంబర్ నాటికి చిత్రాన్ని పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్.