ఆరంభమైన పోలింగ్.. ఓటేసిన హరీశ్ రావు..

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ రానే వచ్చింది. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఓటర్లు తమ ఓటు ఆయుధంతో రాజకీయాలను శాసించడానికి పోలింగ్ బూతులకు కదిలారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. కొడంగల్‌, స్టేషన్ ఘనపూర్‌ శివునిపురిలో పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. నాగర్ కర్నూల్‌లోని కోడేరులో ఈవీఎంలు పనిచేయక పోలింగ్ లేటయింది. దీంతో ఓటర్లు విసుగు చెందారు. ఉదయాన్నే ఎవరు లేనప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోదామని వచ్చినవారికి నిరాశే ఎదురైంది. సిబ్బంది సమయానికి చేరుకోక, ఈవీయంలు మొరాయించి ఆలస్యమైంది.

కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని పలు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఇక రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఈవీఎం సమస్యలు నెలకొన్నాయి. ఎల్బీ నగర్ నియోజవర్గంలోని హయత్ నగర్‌, కామారెడ్డిలో పోలింగ్ ఆలస్యం అవడంతో ఓటర్లు ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.Telugu news Starting Polling .. Vote Hareesh Rao ..ఓటేసిన హరీశ్ రావు…

మంత్రి హరీశ్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సిద్ధిపేటలో ఉదయాన్ని పోలింగ్ బూతుకు వెళ్ళి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు హరీశ్. జగదీష్ రావు‌ సైతం శుక్రవారం సూర్యాపేటలో ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం తమ ఓటు వేశారు. బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, సినీ నటుడు వడ్డే నవీన్‌లు హైదరాబాద్‌లో ఓటేశారు. అక్కినేని నాగార్జున, అమల, అల్లు అర్జున్‌లు క్యూలైన్లో నిలుచుని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.