ఎస్‌బీఐ షాక్.. ఏటీఎం డ్రాపై కోత.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐ షాక్.. ఏటీఎం డ్రాపై కోత..

October 1, 2018

స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఏటీఎం నుంచి రోజుకు రూ.20వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చుననే బాంబు పేల్చింది. ఏటీఎం నుంచి ఇంతకుముందు రూ.40వేల వరకు విత్ డ్రా లిమిట్ ఉండేంది. అయితే ఇప్పుడు దాన్ని 20 వేలకు కుదించింది. అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు వెల్లడించింది. ఇది ఈనెలఖరు నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

State Bank Of India  Sensational Decision About Money Withdraw From Atm

నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నప్పటికీ.. వినియోగదారుల నుంచి నగదు డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా తెలిపారు. వినియోగదారులకు రోజుకు రూ.20వేల రూపాయల మొత్తం సరిపోతుందని సంస్థ భావిస్తుందన్నారు. దీని ద్వారా మోసాలను తగ్గించడం సులభమవుతుందన్నారు.  

దీనిపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్లో నగదు దొరక్క ముప్పతిప్పలు పడుతున్నామని, ఏ ఏటీఎంకు వెళ్లిన నగదు ఉండటం లేదని, విత్‌డ్రా లిమిట్ తగ్గిస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.