విశ్వాన్వేషి స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

విశ్వాన్వేషి స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు

March 14, 2018

ఐన్‌స్టీన్ తర్వాత అంతటి భౌతిక శాస్త్రవేత్తగా పేర్కొంది శాస్త్రవేత్తను ఈ ప్రపంచం కోల్పోయింది. బ్లాక్‌హోల్స్( కృష్ణ బిలాలు ) పై అనేక ప్రయోగాలు చేసి ఖగోళ రంగంలో అతిపెద్ద విప్లవాన్ని తీసుకువచ్చిన స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు.ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కేంబ్రిడ్జ్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ‌స‌భ్యులు ప్రకటించారు.

ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో హాకింగ్‌ 1942 జ‌వ‌న‌రి 8 జ‌న్మించారు. తండ్రి వృత్తిరీత్యా వైద్యశాస్త్ర ప‌రిశోధ‌కుడు.1970 నుంచి పరిశోధనలు చేపట్టిన హాకింగ్ మోటార్ న్యూరాన్ వ్యాధివల్ల  చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. కదల్లేని, మాట్లాడలేని స్థితిలోనూవిశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు.

చక్రాల కుర్చీకే పరిమితమైనా ఎన్నో వర్శిటీల్లో బోధనలు చేశారు. తమ తండ్రిని కోల్పోవటం మా కుటుంబంలో పెద్ద విషాదం అని హాకింగ్ పిల్లలు. లూసీ, రాబర్ట్, టిమ్ పేర్కొన్నారు. ఆయన కృషి, వారసత్వం ఏళ్ల తరబడి మనుగడలో ఉంటాయని అన్నారు. తెలివి, హాస్యప్రియత్వంగల ఆయన ధైర్యం, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాదు.. గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి కూడా. కదలలేని స్థితిలో చక్రాల కుర్చీకే అంకితమైనప్పటికీ ఎంతో ఆత్మస్థైర్యంతో వున్నారు. ఆయన రాసిన ‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టై’ అనే పుస్తకం రికార్డు స్థాయిలో 237 వారాల పాటు బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

Image result for stephen hawking

మాట్లాడలేని స్థితిలో కూడా ఆయన కంప్యూటర్ సహాయంతో ఖగోళ పరిశోధనలు చేశారు.ఆయన పరిశోధనలు ఖగోళానికి చెందిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా కూడా మెదడు సహకరిస్తుండడాన్ని ఆయన పసిగట్టారు. క్వాంటమ్ థియరీ, జనరల్ రిలెటివిటీ‌లను ఉపయోగించి ఆయన బ్లాక్‌హోల్స్ కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనిపెట్టారు.