వింత శిశువు… పుట్టిన కొద్దిసేపటికే… - MicTv.in - Telugu News
mictv telugu

వింత శిశువు… పుట్టిన కొద్దిసేపటికే…

October 3, 2018

అవిభక్త కవలలను చూశాం, రెండు తలల శిశువులు జన్మించడం చూశాం. కానీ కర్ణాటకలో ఓ వింత శిశువు జన్మించింది. ఒక కాలు, తోకతో జన్మించిన కొద్ది సేపటికే ఆ శిశువు మరణించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటలో ఈ వింత శిశువు జన్మించింది.

Strange baby ... a little bit of birth …

కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మకు సోమవారం రాత్రి నొప్పులు వచ్చాయి. వెంటనే శనివారసంతేలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు. పుట్టిన బిడ్డను చూసి కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పుట్టిన బిడ్డకు ఒకే కాలు వుండగా, వెనుక భాగంలో తోక వుంది. కొద్దిసేపటికే ఆ వింత శిశువు మరణించింది. అయితే ఆ బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి జననాంగాలు లేవని వైద్యులు చెప్పారు. సన్యులోపం వల్ల ఇలాంటి వింత జననాలు జరుగుతాయని డాక్టర్లు వెల్లడించారు.