మనిషా? తోడేలా? పిల్లా?  - MicTv.in - Telugu News
mictv telugu

మనిషా? తోడేలా? పిల్లా? 

October 21, 2017


ఓ  వింత జంతువుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  అది మనిషా, లేకపోతే జంతువా అని నెటిజన్లు బుర్రగోక్కుంటున్నారు.  ఇది  జంతువు,  మనిషి, తోడేలు, పిల్లి.. ఈ  మూడింటిని పోలి ఉంది. నాలుగు కాళ్లు, తలపై, కాసింత జుట్టు, తోక, నోట్లో రెండు కోరలు ఉన్నాయి.   దీని ఫొటోలతోపాటు వీడియో కూడా  హల్‌చల్ చేస్తోంది.  మలేషియాకు చెందిన ఓ వ్యక్తి  ఈ ఫొటోలను, వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  పశ్చిమ మలేషియాలోని పహంగ్ ప్రాంతంలో ఈ జీవి  ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ దేశ పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని  చెబుతున్నారు.  ఎవరో ప్రచారం కోసం ఆ ఫొటోలను, వీడియోను సృష్టించారని, వాటిని  పట్టించుకోవద్దని  తెలిపారు. లార్డ్ ఆఫ్ ద రింగ్ సినిమాల్లో ఇలాంటి ఉందని చెప్పారు. అయినప్పటికీ అది వింతగా ఉండంతో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని ఓ లేబొరేటరీలో ఉంచి పరీక్షిస్తున్నారని  నెటిజన్లు చెబుతున్నారు.