హాల్ టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్య! - MicTv.in - Telugu News
mictv telugu

హాల్ టికెట్ ఇవ్వలేదని ఆత్మహత్య!

February 28, 2018

ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు బుధవారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదని ఓ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్నాడు. వనపర్తి జిల్లాలోని రావూస్ జూనియర్ కళాశాలలో రాయికోడ్ గ్రామానికి చెందిన  నవీన్(16) ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

అక్కడే కళాశాల హాస్టల్ ఉంటున్నాడు. అయితే ఈరోజు పరీక్షలు మొదలయ్యాయి కానీ నవీన్ కు కళాశాల యజమాన్యం హాల్ టికెట్టును ఇవ్వలేదు. మరి ఫీజు కట్టలేదో, లేక ఇతర కారణాలో తెలిదు కానీ ఈరోజు వరకు కూడా అతనికి హాల్ టికెట్ ను ఇవ్వలేదు. దీనితో మనస్థాపం చెందిన విద్యార్థి  ఉరివేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.