ప్రొఫెసర్ దౌడలు వలగ్గొట్టింది..శభాష్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొఫెసర్ దౌడలు వలగ్గొట్టింది..శభాష్ !

February 8, 2018

విద్యా బుద్ధుుల నేర్పాల్సిన ప్రొఫెసర్  వక్ర బుద్ధితో విద్యార్థినిపై పలుసార్లు  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని వికృత చేష్టలకు విసుగెత్తిపోయిన ఆ విద్యార్థిని  క్లాస్ రూంలోనే తోటి విద్యార్థుల ముందు ఆ ప్రొఫెసర్ రెండు చెంపలను ఛెళ్లున వాయించింది. గల్లా పట్టుకొని నిలదీసింది.
ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజ్‌లో ఈఘటన జరిగింది. ఆ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కీచక  ప్రొఫెసర్‌కు క్లాస్ రూంలోనే బుద్ది చెప్పడంతో విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది. ప్రొఫెసర్‌కు అందరి ముందు మంచిగా బుద్ధి చెప్పింది శభాష్ అంటూ నెటిజన్లు ఆ విద్యార్థినిని పొగుడుతున్నారు. ప్లీజ్ దండం పెడతాను ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చెయ్యద్దంటూ ఆ ప్రొఫెసర్ విద్యార్థినిని వేడుకున్నాడు. ఆ విద్యార్థిని కాలేజీ వైస్ చాన్సలర్‌కి ఉత్తరం రాశి ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కొరింది. కీచక ప్రొఫెసర్ డౌన్ డౌన్ అంటూ క్యాంపస్‌లో విద్యార్థులంతా నిరసనలు తెలిపారు.