ఈవ్ టీజర్ తాట తీసిన అమ్మాయిలు.. శభాష్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈవ్ టీజర్ తాట తీసిన అమ్మాయిలు.. శభాష్ !

March 10, 2018

ఆడవాళ్లే కదా వీళ్లేం చేస్తారులే అనే  ధైర్యంతో ఈవ్ టీజర్లు కొన్ని చోట్ల రెచ్చిపోతున్నారు. కానీ ఆ ఆడవాళ్లు ఓర్పు నశించి  కాళీమాత రూపమెత్తితే ఎలా ఉంటుందో చూపించారు రాజస్థాన్ లో ఉండే కొందురు విద్యార్ధినిలు. శ్రీ గంగానగర్ జిల్లాకి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలోని కొందరు విద్యార్థినిలు  రోజు స్కూల్ కు వెళ్తుంటే రోడ్డుపై కొందరు పోకిరీ గాళ్లు వేధించేవారు. వాళ్లు వేసే వెకిలీ వేశాలను విద్యార్ధినిలు కొన్ని రోజులు ఓపిగ్గా భరించారు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కూడా లాభం లేక పోయింది.


అయితే  ఆ రోజు కూడా ఆరుగురు విద్యార్థినిలు ఎప్పటిలాగే  స్కూల్‌కి బయలుదేరారు. రోడ్డు మధ్యలో ఓ ఈవ్ టీజర్ వారి వెంటపడుతూ వేధించసాగాడు. ఇన్ని రోజులు భరించిన వాళ్ల ఓపిక నశించి  కోపం కట్టలు తెంచుకుంది. వాడి గళ్లా పట్టుకుని చెప్పులతో కొట్టుకుంటూ బుద్ది చెప్పారు. ఇంకోసారి అమ్మాయిలను ఏడిపిస్తావా అంటూ  చెంపల పైన చెప్పులతో వాయించారు.

ఆ తర్వాత చుట్టు ప్రక్కల వారు కూడా వచ్చి వాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. అందుకే అమ్మాయిలు మీరే మీకు ధైర్యం, ఎవరో వస్తారని కాపాడతారని ఎదురు చూడకుండా  పోకిరీలకు భయపడి వారి వెకిలి వేషాలను భరిస్తూ ఉండకండి. ధైర్యంగా ఎదురు తిరిగి మహిళల పవర్ ఏంటో బట్టెవాజ్ గాళ్లకు అర్థం అయ్యేలా చేయండి.