8వ అంతస్థు నుండి దూకిన 10వ తరగతి విద్యార్థులు - MicTv.in - Telugu News
mictv telugu

8వ అంతస్థు నుండి దూకిన 10వ తరగతి విద్యార్థులు

March 8, 2018

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ రోడ్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న భార్గవి, సావని అనే ఇద్దరు అమ్మాయిలు అపార్ట్‌మెంట్‌లోని 8వ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో వీరిద్దరూ 10 తరగతి చదువుతున్నారు.

అయితే భార్గవి కంబైన్డ్ స్టడీ కోసమని సావనిని అపార్ట్ మెంట్ కు పిలిచింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఇద్దరూ 8 అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదువులో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.