చదవనీయండి..ఎదగనీయండి మీ ఆశయాలకోసం పిల్లల్ని చంపకండి - MicTv.in - Telugu News
mictv telugu

చదవనీయండి..ఎదగనీయండి మీ ఆశయాలకోసం పిల్లల్ని చంపకండి

November 24, 2017

నిన్న తమిళనాడులో ఇంటర్నల్ పరీక్షలో కాపీ కొట్టిందని మౌనిక అనే అమ్మాయిని ఉపాద్యాయులు మందలించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మొన్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో ఈసదువులు మేము సదవలేము అని ఉత్తరంరాసి నలుగురు విద్యార్థులు పారిపోయారు. ఈరోజు అదే తమిళనాడులో టీచర్ తిట్టాడని నలుగురు విద్యార్ధినిలు బావిలో దూకి ఆత్మహత్య చేసున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా పనబాకలో 11 వ తరగతి చదువుతున్న  నలుగురు విద్యార్థినిలు టీచర్ అందరి ముందు తిట్టాడనే మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రేవతి, దీప, శంకరి, మనీషా అనే విద్యార్ధినులు పనబాకలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. అయితే క్లాసుకు ఆలస్యంగా వస్తున్నారని టీచర్ గట్టిగా మందలించాడు. తోటి విద్యార్ధుల ముందు పరువు పోయిందని భావించిన విద్యార్ధినిలు మనస్థాపానికి గురై  బావిలో దూకారు. ఈఘటనతో విద్యార్ధినిల తల్లిదండ్రులు సదరు కళాశాలపై తీవ్రంగా మండిపడితున్నారు. టీచర్లు పెడుతున్న టార్చర్లవల్లే తమ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఒత్తిడి ఓవైపు, ర్యాంకుల కోసం కళాశాలల ఒత్తిడి మరోవైపు  ఇవే విద్యార్ధుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని తెలుస్తున్నాయి. బలవంతపు సదువులు సదవలేక విద్యా కుసుమాలు మద్యలోనే రాలిపోతున్నాయి. మీఆశయాలకోసం, పిల్లల్ని  బలిపశువులను చేయకండి. చదువు అంటే వాళ్లకు ఇష్టం కలిగించి, వారికి ఇష్టానుసారంగా వాళ్ల జీవితాలను నిలబెట్టుకోవడానికి ప్రోత్సహించండి అంతేకాని  మీ ఆశయాలను వారిపై రుద్దకండి.