అత్యంత వెనుకబడిన తరగతుల వారికీ..త్వరలో సబ్సీడీలు! - MicTv.in - Telugu News
mictv telugu

అత్యంత వెనుకబడిన తరగతుల వారికీ..త్వరలో సబ్సీడీలు!

March 8, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఎంబిసిలపై సబ్సీడీల వర్షం కురిపించారు. ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చే విధంగానే  అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా స్వయం ఉపాది చేసుకునేలా పథకాలు రూపొందించి  వారికి ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సర బడ్జెట్లో కూడా ఎంబిసిలకు 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సియం ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఈ సారి కూడా వారికోసం మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్.

అంతే కాదు బిసిలకు  అమలు చేసే ఎకనామిక్ సపోర్ట్ స్కీంకు కూడా  ఇప్పుడిచ్చే సబ్సీడి సరిపోదని దానిని కూడా పెంచాల్సిన అవసరం ఉందని  కేసీఆర్ అన్నారు. ఎంబిసిల కోసం ఇచ్చే సబ్సీడీ ఫైల్ పై సంతకం చేసిన సియం…ఆ పథకాలను వెంటనే ప్రారంభించి ఎంబిసిలకు వీలైనంత తొందరలో సబ్సీడీని అందించాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.