సక్సెస్ తలకెక్కకూడదు అంటున్న జీవిత రాజశేఖర్‌తో మైక్ టీవీ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

సక్సెస్ తలకెక్కకూడదు అంటున్న జీవిత రాజశేఖర్‌తో మైక్ టీవీ ముచ్చట

November 21, 2017

గరుడవేగ ’ సినిమా ఇచ్చిన హిట్టుతో మాంచి ఉత్సాహంలో వున్నాడు రాజశేఖర్. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మైక్ టీవీతో తన మనోభావాలను పంచుకున్నారు ‘ సక్సెస్ మనసుకు ఎక్కాలి గానీ తలకు ఎక్కకూడదు.. అది చాలా ప్రమాదం.. అది ఎప్పుడూ మన తోడుగా వుండదు..  ’ అన్నారు.

ప్రవీణ్ సత్తారు నా దగ్గరకు వచ్చి ‘ సర్ మీ మగాడు సినిమాకు ధీటుగా నా దగ్గరు పవర్‌ఫుల్ కథ వుంది ’ అని చెప్పాడు. తొలుత ఈ సినిమాకు ‘ మగాడు 2 ’ అనే పేరు పెడదామన్నాడు. కానీ నేను ఆ సినిమా ఇప్పటి జనరేషన్‌కు గుర్తులేదు కాబట్టి వేరే టైటిల్ ఆలోచించమనగా ఈ ‘ గరుడవేగ ’ టైటిల్ పుట్టింది ’ అన్నారు.

ఇక తన జీవిత భాగస్వామి జీవిత గురించి ప్రస్తావిస్తూ.. నాకు ఫ్రెండు, ఫిలాసఫర్, భార్య అన్నీ తానే.. నాకు బయట స్నేహితులు కూడా తక్కువే. ఖాళీగా వున్నప్పుడు ఇంట్లో వుండి తెలిసినవాళ్ళకు వైద్య సేవలు చేస్తుంటాను. ఈ సినిమా మళ్ళీ రాజశేఖర్ అనేవాణ్ణి నిలబెట్టిన ఆనందం ఒకవైపున్నా.. రాజశేఖర్ పంచుకున్న విశేషాలెన్నో మీ కోసం