గొల్లభామ మనిషి కాదు పురుగు.. సుకుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

గొల్లభామ మనిషి కాదు పురుగు.. సుకుమార్

March 15, 2018

మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ‘రంగస్థలం 1985’ . ఈ చిత్రంలోని  రంగమ్మ… మంగమ్మ పాట విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆదరించింది. అయితే ఈ పటలోని ‘ గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే’ చరణం యాదవ మహిళలను కించపరిచేలా ఉందని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ ఆరోపించాడు. ఆ పదాలను తొలగాంచాలని లేకపోతే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ వివాదం పై   దర్శకుడు సుకుమార్ స్పందించారు….‘గొల్లభామ అనే పదం మనుషులను  ఉద్దేశించింది కాదుఅదొక పురుగు. ఆ పురుగు అందరికీ తెలిసే ఉంటుంది’ సుక్కు చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా సమంత నటిస్తోంది. రంగమ్మ,మంగమ్మ పాటను చంద్రభోస్ రచించాడు. దేవిశ్రీప్రసాద్ స్వరాలను అందించంగా ఎమ్.ఎమ్ మానసి గాత్రం అందించింది. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.