శివనాగులు పాటపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

శివనాగులు పాటపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

April 3, 2018

‘ రంగస్థలం ’ సినిమాలోని శివనాగులు పాట వివాదంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఉద్దేశ పూర్వకంగా శివనాగులు పాటను తీసివేయలేదని చెప్పారు. కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్లే అతని వాయిస్‌కి బదులు దేవిశ్రీ వాయిస్ పెట్టవలసి వచ్చిందని చెప్పారు. ‘ మేము పాట షూట్ చేసేటప్పుడు దేవిగారి వాయిస్‌తోనే వచ్చింది. అలానే సాంగ్ షూట్ చేశాం. ముందు సాంగ్ షూట్ చేశాక తర్వాత ఫోక్ సింగర్‌తో పాడిద్దామనుకున్నాం. తర్వాత ఆల్బంలో శివనాగులు గారు పాడారు.ఆయన చాలా బాగా పాడారు. ఆల్బంలో కూడా ఆయన పాడిందే వుంటుంది. దాన్ని మార్చే ఉద్దేశం అయితే లేదు. దేవిగారి వాయిస్‌తో షూట్ చేయడం వల్ల.. శివ నాగులు వాయిస్‌ లిప్ మ్యాచ్ అవలేదు. అక్కడక్కడా లిప్ సింక్ కుదరలేదు. ఫ్రేమ్స్ ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా ఎక్స్‌ప్రెషన్స్ సెట్ అవట్లేదు. దీంతో దేవీగారి వాయిసే వుంచడం జరిగింది. అంతేగానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు ’ అని క్లారిటీ ఇచ్చారు సుకుమార్.