ఆమె వయసు 18 - అతని వయసు 62 ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె వయసు 18 – అతని వయసు 62 !

August 29, 2017

ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, పిచ్చిది ఇలా.., లవ్వుకు ఎన్ని ట్యాగ్ లైన్లు తగిలించుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటారా ఇక్కడొక ప్రేమకథను మీకు పరిచయం చేస్తాం. దానికి మీరు ఏ ట్యాగ్ లైన్ పెట్టుకుంటారో మీ ఇష్టం.

ఈ లవ్ స్టోరీ చాలా డిఫరెంటు. కుచ్ హట్కే హోతీ హై యే ప్యార్ కీ కహానీ. ఇప్పటి వరకు మనం చూసిన, చదివిన ప్రేమ కథలకు పూర్తి భిన్నమైంది ఈ ప్రేమకథ. ఇంతకీ ఈ ప్రేమకథ ఎక్కడిది అనుకుంటున్నారా ? ఇండోనేషియా దేశంలోనిది. అక్కడే సులేమాన్ – డాయినాకు లవ్వు పుట్టింది. ఈ చిలకా గోరింకలు ఇప్పుడు వరల్డ్ ఫేమస్సయ్యారు. అదేంటీ ఉత్తగా ప్రేమించుకున్నంత మాత్రానా సెలెబ్రిటీలు అయిపోతారా ఏంటి అనేకదా మీ డౌటు ?

యాహ్.. ఖచ్చితంగా వీరి అనోఖీ ప్రేమ్ కథా గురించి తెలిస్తే తప్పకుండా మీరు నిజమే అంటారు. ఇక నాన్చకుండా అసలు విషయంలోకొద్దాం. సులేమాన్ స్యాంగ్ అనబడే ఈ 62 రెండేళ్ళ ముదురు మన్మథుడికి 18 ఏళ్ళ డాయినా డయెంగ్ నగ్నియాంగ్ తో ప్రేమ కలిగింది. అదేంటి తాత వయసున్న అతనికి మనవరాలు వయసున్న ఇతనికి ప్రేమా ? కాకమ్మ కబూర్లు చెప్పకండని అంటారు మీరు. కానీ నమ్మాలి.

నమ్మిన తర్వాత మీరే ఈ ప్రేమకథకు ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి. ఈ ప్రేమకు వయసుతో ఆస్కారం అస్సలు లేదు. లేటు వయసు లవరతను – ఘాటు వయసు జానూ ఈమె. ఇంకే వారి ప్రేమ వయసుల తేడాను మరిచింది.

వారి ప్రేమకు అంకురార్పణ ఇలా జరిగింది :

సులేమాన్ కు తన 20 వ ఏటనే పెళ్ళయింది. ఐదుగురు పిల్లలు కూడా. కొంత కాలానికి ఆయన భార్య చనిపోయింది. అప్పటినుండి అతని ఆలనా పాలనా అంతా తన పిల్లలే చూస్కునేవారట. అలా కొడుకులూ, కూతుళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసేసి బాధ్యతలు దించుకుంటున్నాడు. తొమ్మిది మనవలూ, మనవారాళ్ళు కూడా వున్నారు.

హాయిగా ఇంటి పట్టునుండి తన కంచరి పని చేస్కుంటూ మనవలూ మనవరాళ్లతో ఆడుతూ పాడుతూ తన శేష జీవితాన్ని గడుపుతున్నాడు. ఇన్నేళ్లలో తనెప్పుడూ ఒంటరితనాన్ని అస్సలు ఫీలవ్వలేదట. ఎప్పుడైతే డాయినాను చూసాడో అప్పట్నించి తనకు ఒంటరితనం బోరింగ్ గా అనిపించిందట. చనిపోయిన తన భార్య మళ్ళీ డాయిన రూపంలో జన్మించిందా అనుకున్నాట్ట.

వాళ్ళ నాన్నది కత్తులూ, కొడవళ్ళ వ్యాపారమంట. అక్కడికి ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్ళేవాడట సులేమాన్. వచ్చిన అతిథికి టీలు, కాఫీలిచ్చే డాయినాను చూసి సులేమాన్ మతి పోయింది. మనసు ఆమె మీదకు అయస్కాంతంలా అతుక్కుపోయింది. అలా వారి చూపులు కలిసాయి. డేర్ చేసి ఒకరోజు తనే ఆమెకి తన లవ్ ప్రపోజ్ కూడా చేసాడట.

ఆమె వెంటనే ఒప్పేసుకుందట. ఇంకే తాతగారి లుక్కు మారిపోయింది. కుర్రతనం ఉరకలెయ్యసాగింది. పోయిన వయసు మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడ సాగింది. ఇద్దరూ చాటు మాటుగా చిలకా – గోరింకల్లా, నాగుపాము – జెర్రిపోతుల్లా గాఢంగా ప్రేమించుకున్నారు.

అంతలోనే అన్నీ లవ్ స్టోరీస్ కు మల్లే వీళ్ళ లవ్వుకు కూడా పెద్దవాళ్ల నుండి వ్యతిరేకత ఎదురైంది. ముసలోడికీ – పడుచమ్మాయికి లంకె కుదరదని అందరూ ససేమిరా అన్నారు. కానీ వీరు ఎవ్వరి మాటనూ లెక్క చెయ్యలేదు. లేచిపోయి పెళ్లి చేస్కొని వేరు కాపురం పెట్టారు. వాళ్లిద్దరిప్పుడు తమ ప్రేమకు కానుకగా ఒక బిడ్డను కనాలనే కుతూహళంలో వున్నారట. వూళ్ళో, బంధువుల్లో సులేమాన్, డాయినాలను ఎవ్వరు కూడా సమర్థించడం లేదంట.

అందరూ నవ్వుకుంటున్నారట. ఆ ముదిమి ముసలాయనకైనా బుద్ధి లేదు, కనీసం యుక్త వయసు అమ్మాయికైనా బుద్ధి వుండొద్దా అని కొందరు వాదిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికీ బుద్ధి లేదు. దొందూ దొందే. తర్వాత పరిణామాలను దృష్ఠిలో పెట్టుకుంటే బహుశా ఏ ప్రేమకథా పుట్టదేమో. వీళ్ళ ప్రేమ కూడా అంతే.
ఇప్పడు రాస్కోండి మీరే వీళ్ళ ప్రేమకథకు ట్యాగ్ లైన్ ను !!