ఏ పార్టీ నుంచైనా పోటీ చేస్తా.. సుమన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏ పార్టీ నుంచైనా పోటీ చేస్తా.. సుమన్

March 5, 2018

రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటింటించిన సుమన్ దీనిపై మరో ప్రకటన చేశారు. తాను ఏ పార్టీ నుంచైనా బరిలోకి దూకుతానని, ప్రజలకు సేవ చేయడమే తనకు ముఖ్యమని  చెప్పారు. ఆయన ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్య,  వ్యవసాయం రంగ అభివృద్ధి  పాలకులు కృషి చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే తాను వారికి మద్దతు పలుకుతానని వారి కోసం ప్రచారం చేస్తానని తెలిపారు. అంతేకాక ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించాడన్నారు.రైతులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల నిర్ణయం ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు.  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధికి బాటలు వేయాలని పేర్కోన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందని  తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు విద్యాభ్యాసం ఆధారంగా సైకిళ్లు, స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లు అందజేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలని అన్నారు.