థ్రిల్లర్ సినిమాలో సుమంత్..! - MicTv.in - Telugu News
mictv telugu

థ్రిల్లర్ సినిమాలో సుమంత్..!

September 14, 2017

సుమంత్ మంచి కథల మీద దృష్టి పెట్టాడు. అందుకే ‘ నరుడా డోనరుడా ’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీస్కున్నాడు.   దాని తర్వాత సెలెక్టెడ్ గా చేసిన ‘ మళ్ళీరావా ’ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దాని తర్వాత మంచి కథ కోసం ఎదురు చూసిన సుమంత్ కు మంచి కథ దొరికిందట. అదీ ఒక మంచి థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడట. ఈ కథలో సుమంత్ పాత్రకు కొంత నెగెటివ్ షేడ్స్ ఉండనున్నాయట.

అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాకు అనిల్ శ్రీకంఠం అనే కొత్త దర్శకుడట. రియాలిటీకి దగ్గరగా ఉంటూ, సరికొత్త బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది కథ. చక్కటి స్క్రీన్ ప్లే గేమ్ తో ఇంట్రెస్టింగ్ గా వుంటుందట కథ. అనిల్ శ్రీకంఠం చాలా మంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసాడు.

పిల్ల జమిందార్, సుకుమారుడు, ఊహలు గుస గుసలాడే, సావిత్రి, చిత్రాంగధ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పటికే పలుసార్లు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరిపిన సుమంత్ స్క్రిప్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.