త్రివిక్రమ్ సినిమాలో సునీల్ - MicTv.in - Telugu News
mictv telugu

త్రివిక్రమ్ సినిమాలో సునీల్

October 24, 2017

హాస్యనటుడిగా తన సినిమా ప్రస్థానాన్ని  మొదలు పెట్టి , హీరో స్థాయికి ఎదిగాడు సునీల్. సునీల్ సినిమా కెరీర్‌లో త్రివిక్రమ్ పాత్ర చాలా ఉందనే చెప్పాలి. వీళ్లిద్దరి  కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

అయితే  సునీల్ హీరోగా చేసిన కొన్ని సినిమాలు విజయవంతమైనా కూడా, ఈమధ్య  సునీల్‌కు మంచి హిట్ రావడంలేదు.  త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్  కలయికలో వస్తోన్న సినిమాలో సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వాస్తవానికి  ఆ పాత్రను నారా రోహిత్ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదర్లేదు, దీంతో ఆ పాత్రలో సునీల్ నటించేలా త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను ఒప్పించారట.

సినిమాల్లోకి  రాకముందు  త్రివిక్రమ్, సునీల్  రూంమేట్స్. మళ్లీ చాలా రోజుల తర్వాత  తన స్నేహితుడికి అవకాశం ఇచ్చారు త్రివిక్రమ్. మరి సునీల్ చెయ్యబోతోన్న ఆ పాత్ర, గతంలో వచ్చిన సినిమాల్లో లాగే, కామెడీగా ఉండబోతోందో లేక  సీరియస్ గా ఉంటుందో చూడాలె మరి.