అప్పుడు 5 వేల అప్పు తీసుకుని .  ఇప్పుడు 7 వేల కోట్ల విరాళం ఇచ్చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడు 5 వేల అప్పు తీసుకుని .  ఇప్పుడు 7 వేల కోట్ల విరాళం ఇచ్చేశాడు..

December 16, 2017

ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని చాలా సార్లు వింటాం. కానీ భారతీ ఏయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మాత్రం బండి నుంచి.. మునిగిపోని టైటానిక్ ఫిప్పులా ఎదిగాడు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు.  ఒకప్పుడు 5000కోసం అప్పుడు చేసిన వాడు..ఇప్పుడు  పేద విద్యార్ధులకోసం రూ.7000 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఒకప్పుడు సైకిల్ విడి భాగాలు అమ్మిన ఆయన.. ఇప్పుడు ఎయిర్ టెల్ ఛైర్మన్ స్థాయికి ఎదిగాడు. ఢిల్లీలో జరిగిన టైకాన్‌ సదస్సులో సునీల్ మిట్టల్ మాట్లాడుతూ ‘నేను కూడా ఒకప్పుడు  ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కున్న వాన్నే, బ్రిజ్ మోహన్‌లాల్ అనే వ్యక్తి  దగ్గర కొన్ని కాగితాలు పెట్టి రూ.5000 అప్పు తీసుకున్నా, అప్పుడు నాకు ఆయన ఓ మాట చెప్పారు. ఇదే అలవాటుగా మార్చుకోకు అన్న ఆయన మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. అప్పటినుంచి నా శాయశక్తులా కష్టపడ్డాను. తప్పులు చేయడం మానవ సహజం. నేను నా జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోయాను, ఆ తర్వాత మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని పుంజుకున్నాను. నావిజయ రహస్యం ఇది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడితే గెలుపు నీకు చేరువవుతుంది. ఇదే నేను నమ్మాను’ అని మిట్టల్ అన్నారు.