ఏఎస్పీ సునీతారెడ్డి మరో సీక్రెట్ రట్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఏఎస్పీ సునీతారెడ్డి మరో సీక్రెట్ రట్టు

February 12, 2018

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి కూకట్‌పల్లిలోని సునీత ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే.  సునీత భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు.. మల్లికార్జున రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ సస్పెన్షన్ లో ఉన్నారు. కాగా వీరి అక్రమ సంబంధంపై వివాహేత సంబంధానికి సంబంధించి కేసు నమోదైంది.ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఓ ప్రముఖ తెలుగు యాంకర్ సోదరుడైన లెనిన్‌ను సునీతారెడ్డి తొలి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. పెళ్లయిన రెండేళ్లకు లెనిన్‌ను వదిలేసి, అతనిపై వరకట్నం కేసును పెట్టింది సునీత.  ఆ తర్వాత సురేందర్ రెడ్డిని రెండో వివాహం చేసుకుంది. సునీత మొదటి పెళ్లి ఫొటోలను చూసి సురేందర్ రెడ్డి షాక్ అయ్యారు. ఇప్పడు కేసు విచారణలో మొదటి పెళ్లి ఫొటోలు కీలకంగా మారాయి. 

తమ మధ్య అక్రమ సంబంధం లేదని, సునీత విడాకుల కోసం యత్నిస్తోందని, విడాకులు వచ్చాక తాము పెళ్లిచేసుకుందామనుకున్నామని మల్లికార్జున రెడ్డి ఈ విషయమై ఎలా స్పందిస్తాడో తెలియాల్సి వుంది.