చాలా అవమానాలు జరిగాయి..  - MicTv.in - Telugu News
mictv telugu

చాలా అవమానాలు జరిగాయి.. 

September 7, 2017

ప్రఖ్యాత శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో చాలా అవమానాలకు ఎదుర్కున్నానని,  తనతో ఎవరు సరిగ్గా మాట్లాడేవారు కాదని  వెల్లడించింది. నేహా దూపియాతో ఓ షో లో మాట్లాడుతూ…తాను బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో జరిగిన అవమానాల గురించి చెప్పకొని బాధపడింది. తాను బాలీవుడ్ లోకి వచ్చిన మెదట్లో జరిగిన తొలి అవార్డు పంక్షన్ గురించి చెప్పింది.

 

షో నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు తనను స్టేజ్ మీదకు పిలిచారని, తనతోపాటు ఎవరైనా యాక్టర్ ను తీసుకురావలని కోరినట్టు సన్నీ చెప్పింది. కాని తనతో ఏ యాక్టరూ  రాకపోవడంతో తాను చాలాసేపు అలాగే ఆగిపొయానని, చివరిగా నటుడు చుంకీ పాండే  తనకు చేయి అందించి వచ్చాడని చెప్పింది. అందుకే తనకు చుంకీ అంటే ఇప్పటికే  ఎంతో గౌరవమని అని చెప్పింది. ‘మెదట్లో నన్ను చాలా మంది అసహ్యించుకున్నారు వాటిని నేను పట్టించుకోలేదు. కానీ ఆ అవార్డు పంక్షన్ లో కూర్చోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను’  అని చెప్పింది.