సన్నీలియోని వస్తే సామూహికంగా చస్తాం! - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోని వస్తే సామూహికంగా చస్తాం!

December 15, 2017

ఒకప్పటి పోర్న్ స్టార్, ఇప్పటి బాలీవుడ్ నటి సన్నీలియోనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మొన్నోపారి ఆమె కొచ్చి వెళ్లినప్పటి ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఆమె ఎక్కడికైనా వెళితే అభిమానులు పుట్టలోంచి వచ్చిన చీమల్లా గుమిగూడుతారు. కానీ ఇప్పుడు సన్నీలియోని బెంగళూరుకు రావద్దంటూ నిరసనలు, ఆందోళనలు జరగుతున్నాయి.డిసెంబర్ 31 సందర్భంగా బెంగళూరులో జరగనున్న ఓ వేడుకలో పాల్గొనేందుకు సన్నీలియోని ఒప్పుకుంది. సన్నీలియోన్ వేడుకకు వస్తుండడంతో నిర్వాహకులు కూడా భారీగా ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. కానీ ‘కర్ణాటక రక్షణ వేదిక యువసేన’ సన్నీ లియోని బెంగళూరుకు రావడానికి వీళ్లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఒకవేళ సన్నీ వస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సన్నీ ఉద్యానగరికి వచ్చి డ్యాన్స్ చేస్తే కర్ణాటక సంస్కృతి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈవెంట్ నిర్వాహకులు మాత్రం గతంలో చాలా సార్లు సన్నీ బెంగుళూరు కార్యక్రమాల్లో పాల్గొంది, మరి ఇప్పడు పాల్గొంటే తప్పేంటి. అయినా సన్నీ పార్న్ స్టార్ అనేది గతం, ఇప్పుడు ఆమెంటో చూడాలని, అనాథలను దత్తత తీసుకుని  పెంచుకుంటున్న  సన్నీది ఎంతో గొప్ప మనసని వారు అంటున్నారు. ఏది ఏమైనా సన్నీ వస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామని  కర్నాటక యువసేన హెచ్చరిస్తుంది.