త్వరలో సన్నీలియోన్  స్మార్ట్ ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో సన్నీలియోన్  స్మార్ట్ ఫోన్లు

November 26, 2017

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు పలు వ్యాపారాల్లో కూడా బిజీ అవుతోంది. ఇప్పటికే దుస్తులు, కాస్మోటిక్స్ బిజినెస్ చేస్తున్న సన్నీ, త్వరలో తన పేరు మీద ఓ మొబైల్ కంపెనీనీ ఏర్పాటు చేయనుందని సమాచారం.

ఈ విషయంపై  ఇప్పటికే సన్నీ ఓ చైనా కంపెనీని సంప్రదించిందట. యువతను ఆకర్శించే విధంగా  తన పేరుతో పలు మోడళ్ల స్మార్ట్ ఫోన్లను  మార్కెట్లోకి తేవాలని సన్నీ అనుకుంటోంది. ఈకంపెనీకి  సన్నీ భర్త డానియెల్‌ను మేనేజర్ గా నియమించాలని అనుకుంటోదట. దీన్నిబట్టి చూస్తే అతి త్వరలోనే  సన్నీపేరుతో  స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయన్న మాట.