సన్నీలియోని గారాల పట్టి..ఈ బిడ్డ - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోని గారాల పట్టి..ఈ బిడ్డ

November 26, 2017

సన్నీలియోన్ దంపతులు మహారాష్ట్ర లోని లాతోర్ నుంచి ఓ బిడ్డను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పాపకి నిషా కౌర్ వెబర్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ‘మా జీవితంలోకి వచ్చిన బంగారు తల్లి ఈ బిడ్డ’ అని సన్నీ మరియు ఆమె భర్త డానియెల్ మురిసిపోతున్నారు.

మేము మాబిడ్డ నిషాతో ప్రతీ సెకండ్‌ను చాలా ఆనందంగా గడుపుతున్నాం అని చెబుతున్నారు. ఈమధ్య కూతురు నిషాతో ఆనందంగా గడిపిన కొన్ని క్షణాలను, దానికి సంబంధించిన ఫోటోలను సన్నీ తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు చూసిన వారందరు, నిజంగా సన్నీది ఎంత గొప్ప మనసు, మంచి మనసుతో ఓ బిడ్డను దత్తత తీసుకుని కంటికి రెప్పలా చూసుకుంటోంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.