నా బిడ్డకు నేను  కన్నతల్లిని కాదని చెప్తా: సన్నీ - MicTv.in - Telugu News
mictv telugu

నా బిడ్డకు నేను  కన్నతల్లిని కాదని చెప్తా: సన్నీ

November 29, 2017

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ గత కొన్ని నెలల క్రిందట ఓ చిన్నారిని  దత్తత తీసుకుంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన అనాథాశ్రమం నుంచి 21 నెలల నిషా అనే చిన్నారిని సన్నీ, ఆమె భర్త డేనియల్  వెంబర్ దత్తత తీసుకున్నారు. ఆ పాపను తమ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. కానీ  నిషా పెద్దయ్యాకు.. ఆమె దత్తత విషయం చెబుతామని సన్నీ చెప్పింది.

‘నేను కన్నతల్లిని కాదని చెప్తా.. నా బిడ్డ వద్ద ఏ విషయం దాచను. దత్తత తీసుకున్న పిల్లలకు సాధారణంగా ఇలాంటి విషయాలు చెప్పరు.  నేను మాత్రం నిషా దగ్గర ఏ విషయాన్ని దాచాలనుకోవడం లేదు. అందుకే నేను తన  కన్నతల్లిని తను కాదని, తనను దత్తత తీసుకున్నానని చెబుతా.. సంబంధిత దత్తత పత్రాలను కూడా చూపిస్తాను.

ఎందుకంటే తన కన్నతల్లి తనను వదిలేసిందని నిషా బాధపడకూడదు. నేను నిషాను తొమ్మిది నెలలు మోసి  కనకపోయినా, నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను’ అని సన్నీ చెప్పింది. ప్రస్తుతం సన్నీ తేరా ఇంతెజార్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు నిర్మాత అర్బాజ్ ఖాన్‌కు జోడిగా నటిస్తోంది. ఈ చిత్రం  డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.