వర్కవుట్ చేయడం చాలాకష్టం.. సన్నీలియోన్ - MicTv.in - Telugu News
mictv telugu

వర్కవుట్ చేయడం చాలాకష్టం.. సన్నీలియోన్

April 24, 2018

బాటీవుడ్  నటి సన్నీలియోన్  విపరీతంగా అభిమానులను సంపాందించుకుంది. సన్నీ సినిమాలు అంటే అభిమాల్లో చాలా ఆసక్తి పెరిగింది. ప్రత్యేక గీతాలకే పరిమితమైన ఈ అమ్మడు ముఖ్య పాత్రల్లో  నటిస్తోంది. ప్రస్తుతం సన్నీ దక్షణాది సినీ పరిశ్రమలో తన సత్తా చాటనుంది. వీరమహాదేవి అనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు,తమిళం,హిందీ, మలయాళం భాషల్లో రూపొందుతోంది.ఈ  సినిమాలో తన పాత్ర కోసం స‌న్నీ గుర్ర‌పు స్వారీ, క‌త్తి సాము వంటి ప‌లు విద్య‌లు నేర్చుకుంది. అయితే త‌న లుక్ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే స‌న్నీ లియోన్ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంది. జిమ్‌లో రెగ్యుల‌ర్‌గా క‌స‌ర‌త్తులు చేస్తుంది.  ఈ మధ్యే ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో క‌స‌ర‌త్తుకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి దానికి కామెంట్ పెట్టింది. ఈ వ‌ర్క‌వుట్ చేయ‌డం చాలా క‌ష్టం. నా కాళ్ల‌కి ఉన్న బ్యాండ్ అంత ఈజీగా చేయ‌న‌వివ్వ‌దు అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.