‘ కాలా ’‌గా ధోనీ.. సోషల్ మీడియాలో హల్‌చల్... - MicTv.in - Telugu News
mictv telugu

‘ కాలా ’‌గా ధోనీ.. సోషల్ మీడియాలో హల్‌చల్…

March 6, 2018

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ కాలా ’. ఈ చిత్రానికి ‘కబాలి’ ఫేం పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదలై విశేష స్పందన వచ్చింది. అయితే ఈ టీజర్‌ను కొంతమంది  ధోని అభిమానులు ఎడిట్ చేసి ధోనిని కాలాగా చూపిస్తూ ఓ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ధోని ఆడిన మ్యాచ్‌లు, పలు సందర్భాల్లో ధోని పాల్గొన్న ప్రెస్‌మీట్లు, కొన్ని యాడ్స్ కోసం ధోని నటించిన సన్నివేశాలతో ఈ టీజర్‌ను ఎడిట్‌ చేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, డైలాగ్స్‌  అన్ని ధోని కోసమే డిజైన్‌ చేసినట్టుగా సింక్‌ అవ్వటంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.