సుప్రీం కోర్టులో కేంద్రానికి దెబ్బ.. సీబీఐ దళపతిగా మళ్లీ వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం కోర్టులో కేంద్రానికి దెబ్బ.. సీబీఐ దళపతిగా మళ్లీ వర్మ

January 8, 2019

కేంద్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ‌ తగిలింది. సీబీఐ డైరెక్టర్ల అంశంలో కేంద్ర నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు ఈరోజు త‌ప్పుప‌ట్టింది. సీబీఐ చీఫ్‌గా అలోక్ వ‌ర్మను తిరిగి నియ‌మిస్తూ ఇవాళ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఇటీవ‌ల సీబీఐ చీఫ్ అలోక్ వ‌ర్మ‌, స్పెష‌ల్ డైర‌క్ట‌ర్ రాకేశ్ ఆస్థానా మ‌ధ్య వివాదాలు తలెత్తడంతో… కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్మ‌ను సెలవుపై పంపిన విష‌యం తెలిసిందే. దాన్ని స‌వాల్ చేస్తూ అలోక్ వ‌ర్మ.. సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గంగోయ్ ఇవాళ సెలవు తీసుకోవ‌డంతో.. ఆ తీర్పును కోర్టు నెంబర్ 12లో జ‌స్టిస్ సంజ‌య్ కిషన్ కౌల్ వినిపించారు. అయితే అలోక్ వ‌ర్మ కీల‌క నిర్ణ‌యాలు ఏవీ తీసుకోకూడ‌ద‌ని కోర్టు త‌న తీర్పులో స్ప‌ష్టంగా పేర్కొంది. సీబీఐ చీఫ్‌ను నియ‌మించే ప్యాన‌ల్ మాత్రమే అత‌నిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీం తెలిపింది.Telugu News supreme court appointed alok verma as central bureau of investigation directorసీబీఐ డైరెక్ట‌ర్ ఆదర్శనీయంగా ఉండాల‌ని సుప్రీం సూచించింది. సీబీఐ స్వ‌యంప్ర‌తిపత్తిని కాపాడ‌డమే ముఖ్యమని తెలిపింది. ఏదేమైనా అలోక్ వ‌ర్మ‌… ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే రిటైర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. సీబీఐ చీఫ్‌గా రాకేష్ ఆస్థానాకు అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌పై రైల్వే కుంభ‌కోణం విచార‌ణ‌లో అవినీతి జ‌రిగింద‌ని డైర‌క్ట‌ర్ అలోక్ వ‌ర్మ‌పై విజిలెన్సు కమిషన్‌కు రాకేశ్ ఆస్థానా ఫిర్యాదు చేశారు. దాంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అలోక్ వ‌ర్మ కేసులో… కేంద్ర ప్ర‌భుత్వ నియామాల‌ను ఉల్లంఘించింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. వ‌ర్మ అంశాన్ని సెలెక్ట్ క‌మిటీకి పంపించాల్సి ఉంద‌ని పేర్కొంది. చీఫ్ జ‌స్టిస్‌, ప్ర‌ధానితో పాటు ప్ర‌తిప‌క్ష‌నేత‌కు ఆ అంశాన్ని చేర‌వేయాల‌ని, ఆ త‌ర్వాతే తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీం త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డింది.Telugu News supreme court appointed alok verma as central bureau of investigation director