గురునానక్ బయోపిక్ విడుదలకు సుప్రీం ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

గురునానక్ బయోపిక్ విడుదలకు సుప్రీం ఓకే

April 10, 2018

అనేక వివాదాలను దాటుకుని సుప్రీంకోర్టు అనుమతితో ఈనెల 13న విడుదలకు సిద్ధమవుతోంది ‘నానక్ షా ఫకీర్ ’. తొలుత నుంచి ఈ సినిమా విడుదల విషయంలో సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అడ్డుపడుతోంది.

కాగా సుప్రీంకోర్టు ఆ కమిటీని తప్పుబడుతూ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒక్కసారి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసిన తర్వాత అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా ప్రదర్శనలు సజావుగా జరిగేందుకు వీలుగా శాంతి, భద్రతల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.  

సినిమా విషయంలో కొన్ని వర్గాల ఆంక్షలకు వ్యతిరేకంగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిమీద  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్‌తో కూడిన ధర్మాసనం వివిధ కోణాల్లో విచారణ చేపట్టి సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ సినిమా సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్ జీవితం, మత బోధనలపై తెరకెక్కించబడింది. రిటైర్డ్ నేవీ అధికారి హరీందర్ ఎస్ సిక్కా నిర్మాతగా వ్యవహరించారు.