ప్రియా ప్రకాశ్ ఊపిరి పీల్చుకుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్ ఊపిరి పీల్చుకుంది..!

February 21, 2018

కన్నుగీటి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆమె నటించిన ‘ఒరు అదాల్ లవ్’(ఒక అసాధారణ ప్రేమ) చిత్రంలోని పాట ముస్లింల మనోభావాలను కించపరిచే  విధంగా నటించిందని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైయ్యాయి.ఆ కేసులపై స్టే విధించాలని ప్రియ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును బుధవారం సుప్రీం కోర్టు విచారించింది.  తెలంగాణ, మహారాష్ట్ర సహా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్‌పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆమెపై, నిర్మాతపై, దర్శకుడిపై సినిమాకు సంబంధించి ఎటువంటి కేసులనూ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎక్కడా వారిపై కేసులు నమోదు చేయరాదని చెబుతూ, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ ల పూర్వాపరాలను, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు పోలీసులకు  ఆదేశించింది.