mictv telugu

నేనింకా బతికే ఉన్నాను.. సురేశ్ రైనా

February 12, 2019

సోషల్ మీడియా వేదికగా ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అవుతోంది. అది నిజమా? కాదా? అని తెలుసుకునే‌లోపే.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్‌లు, పోస్టులు పెడుతూ బతికున్నవారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా ఇక లేరు. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు అంటూ పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైనా అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ అభిమాన ఆటగాడు ఇక లేరన్న వార్త‌విని బాధపడ్డారు. అయితే ఇదంతా తెలుసుకున్న రైనా వెంటనే స్పందించారు.

Telugu News Suresh Raina Quashes Rumours Of Car Accident, Assures Fans Of His Safety

‘నేను రోడ్డు ప్రమాదంలో మృతి చెందానని వస్తున్న వార్తలు అసత్యం. ఇవి నా కుటుంబాన్ని, స్నేహితులను తీవ్రంగా కలచివేశాయి. ఇలాంటి వార్తలు పట్టించుకోకండి. దేవుడి దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. నాపై ఇలా తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్లపై ఫిర్యాదు చేశాను. త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని సురేశ్ రైనా ట్వీట్ చేశారు.

గతేడాది ఇంగ్లండ్‌పై ఆడిన రైనా.. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. మార్చి 23 నుంచి జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు.Telugu News Suresh Raina Quashes Rumours Of Car Accident, Assures Fans Of His Safety