mictv telugu

సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు

February 13, 2019

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఝాన్సీ ప్రేమికుడు వేరే మగాడితో మాట్లాడొద్దన్నాడు. నటనే మానేయాలన్నాడు. మానసికంగా కుంగదీశాడు. మరో యువతితో పెళ్ళికి సిద్ధమయ్యాడు. ఏడడుగులు వేయాలనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. అంతా శూన్యం.. తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే టీవీ నటి ఝూన్సీ ఆత్మహత్య చేసుకున్నది. ఇవీ పంజాగుట్ట పోలీసుల విచారణలో వెలుగుచూసిన అంశాలు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు అనేక కోణాల్లో ప్రశ్నించి నిజాలను బయటపెట్టించారు.

Telugu News surya teja is responsible for tv actress jhansi suicide.

పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 2018లో ఝూన్సీకి సూర్యతేజతో పరిచయం ఏర్పడింది. తరువాత మే 15న ఝాన్సీ పుట్టినరోజు వేడుకకు సూర్యతేజ హాజరవగా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. జూన్‌లో సూర్యతేజ తన ప్రేమ విషయాన్ని తెలుపగా ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఝాన్సీ గతేడాది ఆగస్టులో వారం రోజుల పాటు సూర్యతేజ ఇంట్లో ఉంది. అక్టోబర్‌లో ద్వారకా తిరుమలలో జరిగిన ఝాన్సీ బంధువుల వివాహానికి సూర్యతేజ హాజరయ్యాడు. నవంబర్‌లో సూర్యతేజ పుట్టినరోజు జరుగగా.. కానుకగా బైక్ కోసం ఝాన్సీ నగదు ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.

జనవరి 30న పెళ్లి ముహూర్తం కోసం ఇరు కుటుంబాల మధ్య మాటలు జరిగాయని, ఫిబ్రవరి 5వ తేదీకి కొన్ని గంటల ముందు సూర్యతో మాట్లాడిన ఝాన్సీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఫోన్ స్విఛాప్ చేయడం గమనార్హం. ఝాన్సీ, సూర్యతేజ ఇద్దరు కలిసి తిరుగుతున్నా.. ఫోన్ సంభాషణల్లో, వాట్సప్ మెసేజ్‌లలో మాటలయుద్ధం కొనసాగినట్టు సమాచారం. ఝాన్సీ డైరీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులకు సూర్యతేజను ఆమె ఎంతగా ప్రేమించిందో తెలిసింది. తాను ప్రాణంగా ప్రేమించే నటనను సైతం సూర్యతేజ అడిగిన వెంటనే వదులుకుంది. తల్లిదండ్రులను ఒప్పించి పెండ్లికి సిద్ధమైంది. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తి దూరుమవుతుండటం.. మరొకరితో వివాహానికి సిద్ధమవుతున్నాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఝూన్సీ మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన సూర్యతేజపై 306,417 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.Telugu News surya teja is responsible for tv actress jhansi suicide